హాలీవుడ్ మీడియాతో తారక్ నటనపై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Apr 9, 2022 10:07 am IST


రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అయ్యిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ల నుంచి లైఫ్ టైం పెర్ఫామెన్స్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారు. మరి ఈ సినిమాలో రిలీజ్ అయ్యాక ఇద్దరి హీరోల కోసం కూడా నేషనల్ వైడ్ మాట్లాకుండా ఉండలేకపోయారు.

అయితే ఈ సినిమాపై పలు హాలీవుడ్ మీడియా సంస్థలు సైతం కూడా ప్రశంసలు కురిపించడం జరిగింది. మరి లేటెస్ట్ గా అయితే ఓ హాలీవుడ్ మీడియాకి రాజమౌళి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తారక్ నటనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది. సినిమాలో పెద్ద హిట్ అయ్యిన కొమురం భీముడో సాంగ్ కి ఎన్టీఆర్ నన్ను ఆశ్చర్యపరిచాడని అందులో నేను ఊహించిన దానికంటే బెటర్ పెర్ఫామెన్స్ ని ఇచ్చి అదరగొట్టాడని తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ మంచి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :