రూ.400 కోట్లు తెలుగు రాష్ట్రాల నుండే రాబట్టాలన్నది జక్కన్న ప్లానా

Published on Feb 6, 2020 6:56 am IST

రాజమౌళి ఉన్నట్టుండి ‘ఆర్ఆర్ఆర్’ 2021 జనవరి 8న వస్తుందని ప్రకటించేశారు. దీంతో వచ్చే యేడాది సంక్రాంతిని టార్గెట్ చేసుకుని సినిమాలు ప్లాన్ చేసుకున్న వారంతా వెనక్కో లేకపోతే ముందుకో మారాల్సిన పరిస్థితి. జక్కన్న ముందు ప్రకటించిన తేదీ కంటే చాలా నెలలు వెనక్కి వెళ్ళి సంక్రాంతిని ఎంచుకోవడం వెనుక ఆయన పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు.

సంక్రాంతి సీజన్ సినిమాలకు ఎంత కలిసొస్తుందో ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ సినిమాలు ప్రూవ్ చేశాయి. ఎంత పోటీ ఉన్నా రెండు చిత్రాలు చెరో రూ.100 కోట్లపైనే షేర్ కలెక్ట్ చేశాయి. మొత్తంగా రూ.రూ.230 కోట్ల వరకు షేర్ అందుకున్నాయి. కాబట్టి బ్రహ్మాండమైన హైప్, చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు బడా హీరోలు, భారీ మార్కెట్ ఉన్న తమ చిత్రం కూడా సంక్రాంతి సీజన్లో సోలోగా వస్తే సాధారణ సమయంలో వచ్చే వసూళ్లకంటే ఎక్కువ రాబట్టవచ్చని, ఒకరకంగా సినిమాకు ఖర్చవుతున్న రూ.400 కోట్లు తెలుగు రాష్ట్రాల నుండే రాబట్టాలని జక్కన్న ప్లాన్ కావొచ్చు.

సంబంధిత సమాచారం :