గత ఐదు రోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు చేస్తున్న సమ్మె వలన తెలుగు సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలపై సమ్మె ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. అయితే రెండు సినిమాల దర్శకనిర్మాతలు మాత్రం తమ సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలసి నటిస్తున్న ‘గోపాల గోపాల’, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమాలు తమ షూటింగ్లను కొనసాగిస్తున్నాయి. ఈ సినిమాలకు కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే బాలన్స్ ఉన్నాయి.
బల్గేరియాలో ‘బాహుబలి’, వారణాసిలో ‘గోపాల గోపాల’ షూటింగులు జరుగుతున్నాయి. ప్రభాస్, తమన్నా, అనుష్కలపై రొమాంటిక్ సాంగ్స్ షూట్ చేయడానికి రాజమౌళి రెడీ అయ్యారు. వీటితో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. ‘బాహుబలి’కి ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నాడు. ‘గోపాల గోపాల’కు ఇతర ఇండస్ట్రీ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నట్టు సమాచారం. ఇంట్రడక్షన్ సాంగ్ తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించడానికి వీలుగా ఉంటుందని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది.


