
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రెండు పార్ట్స్ గా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ‘బాహుబలి – ది బిగెనింగ్’ గా జూలై 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. అదే తనకి ఓ చైనా ఫిల్మ్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం.
కొద్ది రోజులుగా బాహుబలి ఎఫెక్ట్ వల్ల మీకు హాలీవుడ్ లో ఆఫర్ వచ్చిందని వస్తున్న వార్తలని ఆయన ముందు ఉంచితే ‘బాహుబలి ఇంటర్నేషనల్ గా రీచ్ అయ్యింది. అందరూ అంటున్నట్టు నాకు హాలీవుడ్ నుంచి ఆఫర్ రాలేదు కానీ చైనా నుంచి ఓ సినిమాకి డైరెక్షన్ చెయ్యమని ఆఫర్ వచ్చింది. కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఎందుకు అంటే నేనిప్పుడు బాహుబలి మధ్యలో ఉన్నాను. సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాకే బాహుబలి పని పూర్తవుతుంది. అప్పటి వరకూ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించనని’ తెలిపాడు. దీని ప్రకారం చూసుకుంటే రాజమౌళి బాహుబలి కోసం చైనా ఆఫర్ ని కూడా సున్నితంగా తిరష్కరించాడు అని చెప్పాలి.
ప్రస్తుతం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్న బాహుబలి తమిళ ఆడియోని జూన్ 24న, మలయాళ వెర్షన్ ఆడియోని జూన్ 27న రిలీజ్ చేయనున్నారు. ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.