రాజమౌళి మెచ్చిన టాలీవుడ్ దర్శకుడు అతడే

రాజమౌళి మెచ్చిన టాలీవుడ్ దర్శకుడు అతడే

Published on Apr 19, 2020 1:00 AM IST

Rajamouli Sukumar

దర్శక ధీరుడు రాజమౌళికి పరిశ్రమలో ఉన్న గుర్తింపు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో సచిన్ రికార్డ్స్ లా సినిమా పరిశ్రమలో రాజమౌళి రికార్డ్స్ చెప్పులేనన్ని. అసలు ఇంత వరకు ఫ్లాప్ అనేది ఆయనకు ఎదురు కాకపోవడం అరుదైన అంశం. మరి ఇంతటి టాప్ రికార్డు ఉన్న దర్శకుడికి ఇష్టమైన దర్శకుడు ఎవరై ఉంటారు అనేది ఆసక్తికర విషయమే. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో తనకు నచ్చిన దర్శకుడు ఎవరో చెప్పారు.

రాజమౌళికి ఇష్టమైన దర్శకుడు సుకుమార్ అట. ఆయన స్టోరీ టెల్లింగ్ అండ్ టేకింగ్ చాలా బాగుంటాయట. అందుకే తనకు సుకుమార్ అంటే చాల ఇష్టం అని రాజమౌళి చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం చరణ్ మరియు ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీ స్టారర్ చేస్తుండగా, వీరిద్దరూ అల్లూరి మరియు కొమరం భీమ్ పాత్రలు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా జనవరి 8, 2021లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు