జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లు హైలెట్ అంటా !

Published on Mar 5, 2019 8:49 pm IST

జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట.

రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More