‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో ప్రభాస్ ?

‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో ప్రభాస్ ?

Published on Nov 4, 2018 7:29 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు జరగబోతున్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక అతిధిగా రానున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ కి రాజమౌళితోనే కాక, ఎన్టీఆర్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ ప్రత్యేక అతిధిగా వస్తున్నాడనే విషయం గురించి చిత్రబృందం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ సరికొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ ఆధ్వర్యంలో కసరత్తులు కూడా చేస్తున్నాడట. ఐతే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల పేర్లను కూడా చిత్రం ప్రారంభోత్సవం 11వ తేదీ నాడే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు