రాజమౌళి సార్ మీకు పెద్ద అభిమానిని – దర్శకుడు శంకర్

రాజమౌళి సార్ మీకు పెద్ద అభిమానిని – దర్శకుడు శంకర్

Published on Nov 3, 2018 4:27 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న ‘2.ఓ’ చిత్రం థియేటర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం తాజగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాని 4డీ సౌండ్స్‌ తో తెరకెక్కించామని, థియేటర్లలో మనం కూర్చున్న సీటు కింద స్పీకర్‌ పెట్టారా అన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుందని అన్నారు. ఇది తను ఎప్పటినుంచో కంటున్న కలని, ఈ కలను సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి సహాయంతో అది నెరవేయిందని ఆనందం వ్యక్తం చేశారు.

శంకర్ ఇంకా మాట్లాడుతూ.. ఈ వయసులో కూడా రజనీకాంత్ గారి అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని.. ఇన్నేళ్ల ఆయన అనుభవమే ఆయనకి నిజమైన సూపర్ స్టార్ ని చేసిందని శంకర్ చెప్పారు. శంకర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అంచనాలను అందుకోవడంతో పాటు అందర్నీ ఆశ్చర్యపరుస్తోందని.. రజనీ యాక్షన్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

చివరగా శంకర్, ఈ చిత్రంలో అతి ముఖ్యమైన కీలక పాత్రలో నటించినందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఈ సందర్భంగా రాజమౌళి.. ‘ఈ చిత్రం చేస్తోన్న సమయంలో మీరు ప్రెజర్‌ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు ?’ అని ప్రశ్నించారు. దర్శకుడు శంకర్ ఈ ప్రశ్నకు సమాధానంగా..‘రాజమౌళి సార్.. నేను మీకు పెద్ద అభిమానిని. మీరు ఇండియన్ సినిమాకే గొప్ప గర్వకారణం. ఇక మీరు అడిగిన ప్రశ్నకు.. ప్రెజర్‌ ని హ్యాండిల్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువగా పని చేయాలి’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు