“ఆర్ ఆర్ ఆర్” ఒక్క ఫైట్ కోసం ఇంత ఖర్చా?

Published on Jun 7, 2019 8:38 am IST

“ఆర్ ఆర్ ఆర్” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తి ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ. టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎన్టీఆర్,చరణ్ లను రాజమౌళి స్వాతంత్ర్య సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో చూపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని శివార్లలో గల అల్యూమినియం కర్మాగారంలో వేసిన సెట్ లో ఈ మూవీ షెడ్యూలు లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.

ఐతే ఈ మూవీ గురించి మరొక ఆసక్తికర అప్డేట్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ని గ్రాండ్ గా తెరకెక్కించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట. ఓ పోరాట సన్నివేశం కోసం ఏకంగా రెండు నెలల లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసారట. ఈ పోరాట సన్నివేశంలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొననుండగా దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో చిత్రీకరించనున్నారని సమాచారం. కేవలం ఈ ఫైట్ సన్నివేశం కోసమే రాజమౌళి దాదాపు 45 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఓ గ్రాండ్ విజువల్ వండర్ గా ఈ పోరాట సన్నివేశాన్ని మలచనున్నారట. దాదాపు 350 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని 2020 జులై 30న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి గతంలోనే ప్రకటించారు.

సంబంధిత సమాచారం :

More