మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిపి దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేసిన భారీ పీరియాడిక్ వండర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాను ఎలా ప్లాన్ చెయ్యాలో బాగా తెలిసిన జక్కన ఈ చిత్రాన్ని కూడా అంతే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
అలా ఈ చిత్రంలోకి టేకప్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ లేటెస్ట్ గానే “RRR” సెట్స్ లోకి అడుగు పెట్టగా చిత్ర యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం జక్కన ఆలియాపై కొన్ని ఎమోషనల్ సీన్స్ తోనే స్టార్ట్ చేస్తున్నారట.
రామ్ చరణ్ పోషిస్తున్న రామరాజుకు సీతగా నటించే ఈ పాత్రలో ముందుగా వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను ఆమెపై ప్లాన్ చేసారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


