ఆ విషయంలో రాజమౌళి పాస్.. మరి సందీప్ రెడ్డి వంగా..?

ఆ విషయంలో రాజమౌళి పాస్.. మరి సందీప్ రెడ్డి వంగా..?

Published on Jul 24, 2026 1:59 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ టైటిల్ ఎలాంటి వివాదం లేకుండా సునాయాసంగా దక్కింది. దర్శకుడు సుబ్బా రెడ్డి 2023లోనే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకుని కథ కూడా సిద్ధం చేసినప్పటికీ, రాజమౌళికి కావాలని తెలిసి రూపాయి కూడా ఆశించకుండా సంతోషంగా ఇచ్చేశారు.

మరోవైపు సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు మాత్రం తీవ్ర చిక్కులు ఎదురవుతున్నాయి. ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ అనే ఇండిపెండెంట్ చిత్ర నిర్మాతలు తమ దగ్గర ఈ టైటిల్ హక్కులు ఉన్నాయని వాదిస్తున్నారు. టి-సిరీస్ నుండి తమకు లీగల్ నోటీసులు కూడా వచ్చాయని, చర్చలు విఫలం కావడంతో వారు ఫిలిం ఛాంబర్, సెన్సార్ బోర్డ్‌లను ఆశ్రయించారు. ఒకే సమయంలో ఒక సినిమాకు టైటిల్ ఉచితంగా దక్కగా, మరో సినిమా టైటిల్ లీగల్ పోరాటంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు