బిగ్ అప్డేట్..”బ్రహ్మాస్త్ర” ని సౌత్ లో రిలీజ్ చేయనున్న రాజమౌళి.!

Published on Dec 18, 2021 3:00 pm IST

బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ చిత్రాల్లో స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బిగ్గెస్ట్ చిత్రం ఇది. భారీ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ విజువల్స్ తో గత మూడేళ్ల కితం నుంచి చేసిన సినిమా ఇది. మరి ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటించడం జరిగింది.

మరి షూటింగ్ ఆల్రెడీ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈరోజు తెలుగు వెర్షన్ కి సంబంధించి ఒక ఈవెంట్ ని మేకర్స్ నిర్వహించగా దానికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి మరియు నాగ్ సహా బ్రహ్మాస్త్ర టీం వచ్చారు. ఈ వేదిక ద్వారా రాజమోళి కీలక అనౌన్సమెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది.

ఈ భారీ సినిమాని దక్షిణాదిలో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనితో ఈ సినిమాలో సౌత్ ఇండియన్ సినిమా దగ్గర బ్రేకీవెన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమాని ఒరిజినల్ గా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణం వహించగా వచ్చే వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :