
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకంగా సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక హీరోయిన్ గా కనిపిస్తోంది. గత వారమే ఈ చిత్ర తాజా షెడ్యూల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ సెట్ లో పూర్తి చేసారు. మొదటి సారిగా తమన్నా ఈ షెడ్యూల్ లోనే అడుగుపెట్టింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యేటప్పటికి రాజమౌళి, తమన్నా ఒకరిని ఒకరు తెగపొగిడేసుకుంటున్నారు.
‘తమన్నాతో మొదటి సారి కలిసి పని చేస్తున్నాను. తన గ్రాస్పింగ్ పవర్ మరియు పెర్ఫార్మన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. బాహుబలికి తనొక స్పెషల్ అట్రాక్షన్’ అని రాజమౌళి ట్వీట్ చేసాడు.
‘బ్రిలియంట్ రాజమౌళితో పనిచేసే కల నెరవేరింది. బాహుబలిలో ఒక పార్ట్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. తదుపరి షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’ తమన్నా ట్వీట్ చేసింది.
ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్సహ్కుల ముందుకు రానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.



