భీం టీజర్ కాంట్రవర్సీపై జక్కన టీం క్లారిటీ.!

భీం టీజర్ కాంట్రవర్సీపై జక్కన టీం క్లారిటీ.!

Published on Oct 28, 2020 3:01 PM IST

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాలూకా కొమరం భీం టీజర్ ను దర్శకుడు దిగ్గజం రాజమౌళి తన “రౌద్రం రణం రుధిరం” నుంచి విడుదల చెయ్యగా భారీ రెస్పాన్స్ తూ పాటుగా రాజమౌళి సినిమాలకు ఎదురయ్యే వివాదాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ టీజర్ లో భీం ను చివరి షాట్ లో ఒక ముస్లిం గా చూపిన షాట్ ఉంటుంది. దీనిపై భీం వారసులు మరియు కొంతమంది గిరిజనుల తెగల వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

అక్కడి నుంచే ఊహించని షాక్ ను చూగొన్న మేకర్స్ ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. జక్కన టీం చెబుతున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ లో తారక్ ను అలా చూపించిన దానికి మరియు భీం కథకు సంబంధం ఉండదని అయినా చిన్న టీజర్ ను చూసి మొత్తం సినిమాపైనే ఒక అంచనాకు రావడం సరికాదని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే ఇలాంటి సున్నితమైన అంశాలు తెలుగు ఇండస్ట్రీలో ఎదురు కావడం కొత్తేమి కాదు. ఆ మధ్య హరీష్ శంకర్ మరియు వరుణ్ తేజ్ ల కాంబోలో వచ్చిన “గద్దల కొండ గణేష్” కు కూడా ఇలానే అయ్యింది. టైటిల్ మార్చమని పెద్ద వివాదం అనంతరం సినిమా చూసాక అసలు హరీష్ “వాల్మీకి” అనే టైటిల్ ను ఎందుకు పెట్టాలి అనుకున్నారో ఆ నిర్ణయం సరైందే కదా అని చాలా మంది అనుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు