వైరల్ గా మారిన ‘రాజమౌళి 999’ ట్రైలర్

rajamouli 999

ఓ చిన్న సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి పేరు తలపించేలా రాజమౌళి 999 అనే టైటిల్ తో ఈమూవీ ట్రైలర్ విడుదలైంది. సినిమా ప్రపంచంలో జరిగే మోసాలు, అలాగే ప్రస్తుత హీరోలు, సినిమా కథలు వంటి అనేక విషయాలపై సెటైరికల్ గా ఈ మూవీ తెరకెక్కింది. యథార్థ సంఘటల స్ఫూర్తి తో ఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. ఈ మూవీ పూర్తిగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితులను ఉద్దేశించి తెరకెక్కించారు.

దర్శకుడు ఆర్ కె ఈ మూవీని తెరకెక్కించారు. యూట్యూబ్ లో రాజమౌళి 999 ట్రైలర్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రైలర్ వైరల్ కావడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక పూర్తి సినిమా ఎలా తీశారో అన్న ఆసక్తి పెరిగిపోయింది.

Exit mobile version