ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెప్తారో.. ?

Published on Mar 10, 2019 11:48 am IST

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఇక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక చిత్రబృందం కోల్ కాతాలో జరగబోయే షెడ్యూల్ కోసం బయల్దేరనుంది. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షెడ్యూల్ ముగిశాక ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రెస్ మీట్ ను పెట్టనున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెప్తారో ఏ విషయాలను రివీల్ చేస్తారో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో.. అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More