ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వనంటున్న రజిని.

Published on Aug 18, 2019 2:00 am IST

ప్రముఖ తమిళ సినీ కథా రచయిత కలైం జ్ఞానం గారికి చెన్నైలో దర్శకుడు భారతి రాజా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై కలైం జ్ఞానంను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వేదికపై ప్రస్తావించారు. సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తున్న హీరోలు తప్ప ఆ కథలు అందించిన రచయితల పేర్లు ఎవరి తెలియడం లేదన్నారు. అలాగే కలైం జ్ఞానం గారు ఒక అద్దె ఇంటిలో ఉంటున్నారని తెలిసి బాదపడ్డాన్నారు. ప్రభుత్వం ఆయనకి ఒక ఇంటిని మంజూరు చేయనుందని తెలిసిందని, కానీ నేను ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వను, నేనే ఆయనకు ఒక ఇంటిని ఇవ్వదలచుకున్నాను అన్నారు.

ఇక రజని ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది

సంబంధిత సమాచారం :