రజని ఇంట్రడక్షన్ సీన్ ఒక్కటి చాలు అంట !

Published on Jan 10, 2019 11:10 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే 69 సంవత్సరాల వయసులో కూడా రజినీకాంత్ ఈ చిత్రంతో మళ్ళీ పాత రజినిని గుర్తుకుతెచ్చాడు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో మ్యానరిజమ్స్ తో కట్టిపడేశాడు.

ఇక ఐదు నిముషాలు పాటు సాగే రజని ఇంట్రడక్షన్ సీన్ కి కూడా థియేటర్ ల్లో ఒక్కటే విజిల్స్, అరుపులు. ఈ విజిల్స్ అరుపులను బట్టి మాములు ప్రేక్షకులకు రజని స్టార్ డమ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది. కొంతమంది అభిమానులు అయితే సోషల్ మీడియాలో ఈ ఒక్క రజని ఇంట్రడక్షన్ సీన్ చాలు మాకు ఈ సినిమా చూడటానికి అని కామెంట్లు పెడుతున్నారు.

పేట సినిమా పరిస్థితి ఏమో గాని, మొత్తానికి రజిని మాత్రం సంక్రాంతికి తన అభిమానులను బాగానే అలరించనున్నాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More