‘ది లయన్ కింగ్’ వస్తే రజనీ ఐనా దారివ్వాల్సిందే…!

Published on Jun 26, 2019 11:49 am IST

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకముగా తెరకెక్కించిన ఆనిమేషన్ విజువల్ వండర్ “ది లయన్ కింగ్” జులై 19న అన్నిముఖ్య భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాలున్న ఈ మూవీ విడుదల కారణంగా చైనాలో జులై 12న విడుదల కావాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘2.0’ మూవీ విడుదల వాయిదావేయడం సంచలనంగా మారింది. చైనాలో ‘2.0’ విడుదల హక్కులను సొంతం చేసుకున్న ఎచ్ వై మీడియా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా జులై 19న విడుదల కానున్న “ది లయన్ కింగ్”, చైనాలో మాత్రం 12నే విడుదల కానుందట. దీనితో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉండటంతో, ఆ ప్రభావం రజని మూవీ వసూళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావించిన ఎచ్ వై మీడియా ‘2.0’ మూవీ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించారని వినికిడి.

గతంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘పాడ్ మాన్’ మూవీ వలన ఈ సంస్థ భారీ నష్టాలను చవిచూడటంతో ‘2.0’ని ప్రాఫిటబుల్ వెంచర్ గా మార్చుకోవాలని చూస్తున్నారట. ఏదిఏమైనా చైనాలో తమ అభిమాన హీరో రజని మూవీ వసూళ్లు చూసి మురిసిపోదాం అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఈ వార్త కొంచెం నిరాశకలిగించే విషయమే.

సంబంధిత సమాచారం :

X
More