‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఐతే ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నారని సినీవర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే అయిపోయిందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా, తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలోనే.. ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కాబోతున్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో యష్ రంగినేని, మధుర శ్రీధర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


