తమిళ సినిమాకి సైన్ చేసిన రాజశేఖర్ ?
Published on May 24, 2017 8:38 am IST


కొన్నాళ్లుగా కెరీర్లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నటుడు రాజశేఖర్ కు ఇప్పుడా అవకాశం వచ్చినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు విభిన్నమైన కథలు, పాత్రల కోసం వెతుకుతున్న ఆయనకు వరుసగా అలాంటి అవకాశాలే దక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ‘పిఎస్వీ గరుడ వేగ’ చిత్రాన్ని చేస్తున్న అయన తాజాగా ఒక తమిళ సినిమాకి కూడా సైన్ చేసినట్టు సమాచారం.

ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రాజశేఖర్ కు ఒక భిన్నమైన స్క్రిప్ట్ వినిపించారట. ఆ కథ, అందులోని ప్రధాన పాత్ర నచ్చడంతో రాజశేఖర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా తమిళ వెర్షన్లో మాత్రమే రూపొందుతుందని కూడా అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది, ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook