విలక్షణ నటుడు డా. రాజశేఖర్ త్వరలోనే తమిళ సూపర్ హిట్ అయిన ‘సూదు కవ్వం’ సినిమా రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాకి తెలుగులో ‘గడ్డం గ్యాంగ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. రాజశేఖర్ సరసన ‘పంజా’ ఫేం అంజలి లవానియా హీరోయిన్ గా నటించనుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే లో మొదలు కానుంది. అలాగే ఈ మూవీ మొత్తం షూటింగ్ ని ఒక్క షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంతోష్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.
‘సూదు కవ్వం’ సినిమా తమిళనాడులో పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సరికొత్త ట్రెండ్ ని కూడా సెట్ చేసింది. అదే మేజిక్ ని ఇక్కడ రాజశేఖర్ రిపీట్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి.


