ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో రానున్న రాజశేఖర్ !

Published on Jul 21, 2018 10:04 am IST

సీనియర్ హీరో డా . రాజశేఖర్ చాల రోజుల తరువాత గత ఏడాది ‘గరుడ వేగ ‘సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈచిత్రంలో ఆయన నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు.

ఇక ఈ సినిమా తరువాత ఆయన మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంలో నటించనున్నారు. ‘అవె’ ఫెమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఈచిత్రంలో ఆయన పోలీస్ పాత్రలో నటించనున్నారు . ప్రస్తుతం ప్రశాంత్ తమన్నా కథనాయికగా హిందీ క్వీన్ చిత్రం ను తెలుగులో ‘దటీస్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి త్వరలోనే రాజశేఖర్ తో తెరకెక్కించనున్న చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం :