స్టార్ హీరో కూతురు డెబ్యూ మూవీ ఓ టి టి లో..?

Published on Jul 2, 2020 9:27 am IST

హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్ గా కెరీర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. చిన్న కూతురు శివాత్మిక గత ఏడాది వచ్చిన దొరసాని చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఐతే పెద్ద కూతురు శివాని ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు. ఆమె డెబ్యూ మూవీ మధ్యలో ఆగిపోవడంతో అక్క కంటే ముందు చెల్లి శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు.

కాగా శివాత్మిక నటించిన చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. లాక్ డౌన్ కి ముందే ఈ మూవీ చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. బాలనటుడిగా అనేక సినిమాలలో నటించిన తేజా సజ్జా..ఈ చిత్రంతో సోలో హీరోగా మారుతున్నాడు. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డైరెక్ట్ ఓ టి టి లో విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. మిగతా షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, ఓ టి టి లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More