స్టార్ కిడ్స్ కూడా సాయానికి ముందుకొచ్చారు

Published on Apr 4, 2020 8:00 pm IST

సెలెబ్రిటీ కపుల్ రాజశేఖర్ మరియు జీవిత రాజశేఖర్ కుమార్తెలు శివాత్మిక, శివాని రాజశేఖర్ లు కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం తమ వంతు సాయం చేశారు. తమ బాధ్యతగా వీరిద్దరూ చెరో లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. ఇంకా ఇండస్ట్రీలో సరిగా అడుగులు కూడా పడని వీరి సేవా మనసుని అందరూ అభినందిస్తున్నారు. వీరి తల్లి దండ్రులు రాజశేఖర్, జీవిత సైతమ్ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు.

రాజశేఖర్ కి ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో చిన్న అమ్మాయి ఇప్పటికే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. శివాత్మిక దొరసాని చిత్రంలో హీరోయిన్ గా నటించడం జరిగింది. పీరియాడిక్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీలో శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక శివాని హీరోయిన్ గా ఓ మూవీ ప్రారంభమై అనివార్య కారణాలతో మధ్యలో ఆగిపోయింది.

సంబంధిత సమాచారం :

X
More