సినిమాకి పని చేయకుండానే సినిమా తీశాడట !

Published on Dec 3, 2019 8:11 pm IST

రవికిరణ్ కోలా దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా వచ్చిన ‘రాజావారు రాణిగారు’ భావేద్వేగమైన ప్రేమ కథతో సాగుతూ, ఆహ్లదమైన పల్లెటూరి అమాయక స్వభావంతో నడిచే హాస్యసన్నివేశాలతో ప్రేక్షుకులను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు రవికిరణ్ అసలు దర్శకత్వ శాఖలోనే పని చేయలేదట.

ఈ విషయం గురించి రవికిరణ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మా ఊరి నుండి హైదరాబాద్‌ వచ్చాక సినిమా పై నాకు మరింత ఆసక్తి పెరిగింది. నేను ఎవరి దగ్గరా దర్శకత్వశాఖలో చేయలేదు. ఇంటర్నెట్‌ నుంచి డైరెక్షన్ కు సంబధించిన సమాచారం సేకరిస్తూ, షార్ట్‌ ఫిల్మ్స్‌ చూస్తూ సినిమాని తెరకెక్కించడం ఎలాగో నేర్చుకున్నాను. స్టోరీ కంటే స్క్రీన్ ప్లే బాగుండాలని అర్ధం చేసుకున్నాను. చిన్న అంశాల చుట్టూ సీన్స్ రాసుకుని ప్రేక్షకులను అలరించడం నేను ఇష్టపడతాను. అలాగే ఈ సినిమాని రాశాను. ఇక మాది పల్లెటూరు కావడంతో అక్కడి అనుబంధాలు, రాజకీయాలు, వెటకారాలను సినిమాలో చూపించాను అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :

More