మహేష్ బాబు తండ్రిగా కనిపించనున్న రాజేంద్ర ప్రసాద్

Published on Mar 30, 2014 3:00 pm IST

Mahesh-Babu-Rajendra-Prasad
కామెడీ హీరోగా ఎన్నో రకాల వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమాలో మహేష్ బాబుకి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొంటున్నాడు.

మొదటి సారి తమన్నా మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నాడు. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ‘ఆగడు’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :