‘అదుగో’లో బంటీ కి వాయిస్ ను అందించిన ప్రముఖ నటుడు !

Published on Oct 27, 2018 5:58 pm IST

రవి బాబు పందిపిల్ల ను హీరోగా పెట్టి తెరకెక్కించినచిత్రం ‘అదుగో’. ఈచిత్రంలో బంటీ పాత్రలో నటిస్తున్న పందిపిల్లకు తన వాయిస్ ను అందించారు ప్రముఖ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.

సురేష్ ప్రొడక్షన్స్ పతాకం ఫై రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 7న విడుదలకానుంది. ఇక ఈ చిత్రంలో దర్శకుడు రవి బాబు ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. విభిన్నచిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి బాబు ఈచిత్రాన్ని కూడా ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడట. విజువల్ ఎఫెక్ట్స్ ఈచిత్రానికి కీలకం కానున్నాయి.

సంబంధిత సమాచారం :