పొంగల్ ను టార్గెట్ చేసిన రజినీ !

Published on Mar 28, 2019 8:41 am IST

పేట తరువాత ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ తన తదుపరి చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రజినీ తన 166వ చిత్రంలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 10నుండి ముంబై లో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ చిత్రంలో రజినీ కి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2020 పొంగల్ కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More