పండగకు స్టార్ హీరోల మధ్య పోరు ఖాయం !

పండగకు స్టార్ హీరోల మధ్య పోరు ఖాయం !

Published on Nov 2, 2018 10:57 AM IST

కోలీవుడ్ లో వచ్చే ఏడాది పొంగల్ కు బాక్సాఫిస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు హోరా హోరిగా తలపడనున్నాయి. దాంట్లో మొదటగా తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్ ల్లో కనిపించనున్నాడు. ఇక ఈచిత్రం ఫై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం జనవరి 10న విడుదలకానుంది.

ఇక పొంగల్ బరిలో నిలిచిన మరో చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈచిత్రం కోసం తలైవా అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ చిత్రం జనవరి 11న విడుదలకానుంది.

ఇలా ఒక్క రోజు తేడాతో తమిళ స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలోకి వస్తుండడంతో తమిళ ప్రేక్షకులకు ఈ పొంగల్ మరింత స్పెషల్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు