సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతి సినిమాను యుత్వ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ గతంలో ‘పిజ్జా, జిగర్తాండ, ఇరైవి’ వంటి పలు హిట్ సినిమాల్ని రూపొందించి ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పై దక్షిణాది ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.
ఇక తాజాగా తమిళ పరిశ్రమలో రజనీ ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో సుమారు రూ.60 కోట్ల రెమ్యునరేష్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక రజనీ సినిమాకు 40 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని కూడ అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవముందో లేదో తెలియాలంటే పూర్తి సమాచారం వెలువడేవరకు ఎదురుచూడాల్సిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించనున్నాడు.


