కీర్తి సురేష్ కి సూపర్ స్టార్ అభినందనలు

Published on Dec 25, 2019 8:00 pm IST

మహానటి సినిమా కీర్తి సురేష్ ఇమేజ్ ని ఆకాశానికి చేర్చింది. ఘనమైన మహానటి సావిత్రి పాత్రను ఆమె అద్భుతంగా తెరపై పండించింది. అటు కమర్షియల్ గా ఇటు కాన్సెప్ట్ పరంగా మహానటి ఘనవిజయాన్ని అందుకొంది. కాగా మహానటి చిత్రంలో సావిత్రి గా నటించిన కీర్తి సురేష్ 2019 సంవత్సరానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. స్వప్న సినిమా పతాకంపై దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

కాగా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ ని సూపర్ స్టార్ రజిని కాంత్ అభినందించారు. ఆమెకు పూల గుచ్ఛం ఇచ్చి అభినందించారు. రజిని 168వ చిత్రంలో కీర్తి సురేష్ ఒక రోల్ చేస్తున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ రజని చెల్లిగా కీర్తి నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ కీర్తి పాత్రపై స్పష్టత లేదు. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనా , కుష్బూ సుందర్ కూడా నటిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం నాలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More