సరికొత్త రికార్డును నెలకొల్పిన రజనీ !

సరికొత్త రికార్డును నెలకొల్పిన రజనీ !

Published on Jun 8, 2018 8:33 AM IST


తమిళనాట సూపర్ స్టార్ రజనీ క్రేజ్ ఏ స్థాయిదో చెప్పనక్కర్లేదు. ఎంతమంది స్టార్ హీరోలున్నా రజనీ క్రేజ్ ప్రత్యేకమైంది. అందుకే తమిళనాడులో ఆయన సినిమాల ఓపెనింగ్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతూ ఉంటాయి. వివరాల్లోకి వెళితే నిన్న విడుదలైన ఆయన ‘కాలా’ చిత్రం చెన్నై సిటీలో పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ అందుకుంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మొదటి రోజు ఈ చిత్రం చెన్నై సిటీలో రూ.1.76 కోట్ల గ్రాస్ రాబట్టి గతంలో విజయ్ సినిమా ‘మెర్సల్’ పేరు మీదున్న రూ.1.52 కోట్ల రికార్డుని అధిగమించింది. ఓవర్సీస్లో కూడ ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రం హాఫ్ మిలియన్ వరకు కలెక్ట్ చేసింది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధనుష్ స్వయంగా నిర్మించారు. ఇకపోతే సూపర్ స్టార్ నిన్ననే తన కొత్త సినిమా చిత్రీకరణను మొదలుపెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు