ఫ్యాన్స్ కు సప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్ !

Published on Apr 9, 2019 8:45 am IST

పేట తరువాత తన తరువాతి చిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఫస్ట్ లుక్ , టైటిల్ ను రివీల్ చేసి ఫ్యాన్స్ ను థ్రిల్ చేశాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘దర్బార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదలచేశారు.

ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 10నుండి స్టార్ట్ కానుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫిసర్ గా నటించనుండగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్నీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :