డార్జిలింగ్ లో విల్లా కు రజినీ కాంత్ పేరు !

డార్జిలింగ్ లో విల్లా కు రజినీ కాంత్ పేరు !

Published on Jun 21, 2018 10:06 PM IST


తలైవా రజినీకాంత్ ఎక్కడున్నా తన పవర్ ఏమిటో అందరికి తెలిసేలా చేస్తాడు ప్రస్తుతం ఆయన కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు .ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది . ఈ షూటింగ్ నిమిత్తం రజినీ క్యురీసెంగ్ అనే పాత్రం లోని అల్లిటా అనే రిసార్ట్ లో రూమ్ నెంబర్ 3లో పది రోజులుగా ఉంటున్నారు.

అయన అక్కడ ఉంటున్నాడన్న విషయం తెలుసుకొని అభిమానులు ఆయనను కలవడానికి వస్తున్నారు ఇక అక్కడ తలైవా కు వున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఆ రిసార్ట్ ఓనర్లు ఆ విల్లా కు రజినీకాంత్ విల్లాగా పేరు పెట్టారు. ఇక రజినీ ఇంకొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం అక్కడే ఉండనున్నారు. ఆయన నటిస్తున్న ఈ చిత్రం ఫై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు . సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు