ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్ళనున్న రజనీ కొత్త సినిమా

ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్ళనున్న రజనీ కొత్త సినిమా

Published on Jun 1, 2015 10:59 PM IST

rajnikanth
‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత తన కొత్త సినిమాల విషయంలో రజనీకాంత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ‘లింగా’ విడుదలై దాదాపుగా ఐదు నెలలైన తర్వాత తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు రజనీ. కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో ఉన్న రజనీ, ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే.

తాజాగా కొద్దిసేపటిక్రితమే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ సమాచారం అందింది. దాదాపు 120రోజుల పాటూ జరగనున్న ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నెలలో మొదలుకానుంది. మొదట మలేషియాలో 60రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత చెన్నై, హంగ్‌కాక్‌లలో మరో 60 రోజుల షూటింగ్ జరగనుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ తన వయసుకు సరిపోయే తరహా పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తెరకెక్కనుంది.

తాజా వార్తలు