ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన సూపర్ స్టార్ !

20th, October 2016 - 08:45:40 AM

Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రోబో 2.0’. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన ‘రోబో’ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితమే అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అయిన రజనీ మళ్ళీ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో ‘కబాలి’ షూటింగ్ పూర్తైన తరువాత రజనీ కిడ్నీ సంబంధిత చికిత్స కోసం అమెరికా వెళ్లారు. కనీసం ఎటువంటి సమాచారం లేకుండా వెళ్లిపోవడంతో అభిమానులు కంగారుపడ్డారు. ఆ తరువాత రాజన్ క్షేమంగా తిరిగిరావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మళ్ళీ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ కు కొనసాగింపు కోసమే రజనీ యూఎస్ వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే రజనీ రోబో 2.0 టాకీ పార్ట్ పార్ట్ చేసిన తరువాతే అమెరికా వెళ్లారట. రజనీతో పటు ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కొందరు అమెరికా ఇడుదల వెళ్లారని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను నవంబర్ లో విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు.