డ్యూయెల్ రోల్ లో సూపర్ స్టార్ ?

Published on Mar 31, 2019 9:20 am IST

పేట తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి సారి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడని తెలిసిందే. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ముంబై లో ఏప్రిల్ 10నుండి స్టార్ట్ కానుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో రజినీ కి డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని టాక్ . మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తలైవా కు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :