వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్ వెళ్లనున్న సూపర్ స్టార్ !
Published on Apr 23, 2018 12:35 pm IST

కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజనీకాంతి వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రజనీ అమెరికా వెళ్లిపోవడంతో అభిమానులు కొంత కంగారును గురైనా ఆ తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మళ్ళీ ఇప్పుడు అదే మెడికల్ చెకప్ నిమిత్తం ఈరోజు రాత్రి అమెరికా వెళ్లనున్నారాయన. సుమారు 2 వారాల పాటు ఈ చెకప్ ఉండనుంది. ఇకపోతే పా.రంజిత్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘కాలా’ చిత్రం జూన్ 7న విడుదలకానుండగా శంకర్ తో చేసిన ‘2 పాయింట్ 0’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ రెండూ కాకుండా యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు రజనీ.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook