స్వయంగా రంగంలోకి దిగిన రజనీకాంత్ !
Published on Jun 4, 2018 12:30 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది. తెలుగులో కూడ ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు. దీంతో సినిమా ప్రమోషన్ల కోసం స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగారు.

ఈరోజు హైదరాబాద్లో జరగనున్న ప్రమోషన్స్ లో ఆయన తెలుగు మీడియాతో మాట్లాడనున్నారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు, ఈ చిత్ర నిర్మాత హీరో ధనుష్ కూడ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రజనీ లోకల్ డాన్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటించారు. రజనీతో గతంలో ‘కబాలి’ సినిమాను రూపొందించిన పా.రంజిత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook