రజినీ, అజిత్ సినిమాలు ఒకేసారి బరిలోకి!

Published on Jul 4, 2021 10:30 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే చిత్రం ఈ ఏడాది దీపావళి కు విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇటీవల విడుదల తేదీ ను ప్రకటించడం మాత్రమే కాకుండా, క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం లో రజినీకాంత్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. అయితే ఈసారి దీపావళి బరిలోకి దిగేందుకు మరొక స్టార్ హీరు సిద్దం అయ్యారు. అతనే అజిత్.

అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాలిమై. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను బోని కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ కింద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో యామి గౌతమ్, హుమ కురేశి, పవేల్ నవగీతన్, కార్తికేయ గుమ్మకొండ, యోగిబాబ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాకుండా, ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు కావడం తో పోటీ గట్టిగా ఉంటుంది అంటూ కొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం :