రషెస్ చూసిన రజినీ దర్శకుడితో ఏమన్నారంటే..

Published on Jun 11, 2021 10:00 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ చిత్రం ఈమధ్యనే రీస్టార్ట్ అయింది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా లాక్ డౌన్ పడటంతో సినిమా మళ్లీ ఆగిపోయింది. ఇంకొద్దిరోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తమిళనాట లాక్ డౌన్ ఎత్తివేసిన తర్బాత షూటింగ్ రీస్టార్ట్ అవుతుంది. అయితే ఈలోపు చిత్ర బృందం రషెస్ చూడటం జరిగిందట.

వాటిని చూసిన టీమ్ సంతృప్తిగా ఫీలయ్యారట. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే డైరెక్టర్ శివను ప్రశంసలతో ముంచెత్తారట. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినందుకు మెచ్చుకున్నారట. లాంగ్ గ్యాప్ తర్వాత రజినీ నుండి వస్తున్న సినిమా కావడం, రజినీ గత చిత్రం ‘దర్బార్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రం మీద
అంచనాలు భారీగా పెట్టుకున్నారు అభిమానులు. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. రజినీకి జోడీగా నయనతార నటిస్తుండగా కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :