రజిని సినిమా మళ్లీ జూన్ నుండే !

Published on Apr 25, 2021 9:36 pm IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మళ్ళీ హైదరాబాద్ లోనే షూటింగ్‌ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘అన్నాత్తే’ షూటింగ్‌ కి నేటి నుండి బ్రేక్ పడింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతూ ఉండటంతో మేకర్స్ ప్రస్తుతానికి షూట్ ను ఆపాలని నిర్ణయించుకున్నారు. జూన్ నుండి తిరిగి షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. నిజానికి గత ఏడాది చివర్లో హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినప్పుడు యూనిట్‌లో నలుగురికి కరోనా రాకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యేది. మళ్ళీ ఆ తరువాత రజినికి ఆరోగ్య సమస్యలువచ్చాయి. దాంతో ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అయింది.

అందుకే రజిని తన విశ్రాంతిని పక్కన పెట్టి మళ్ళీ షూట్ కి సిద్ధం అయ్యాడు. కానీ మళ్ళీ అంతలోనే కరోనా సెకెండ్ వేవ్ వచ్చి పడింది. దాంతో షూట్ కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రజినీ – శివ కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది గొప్ప టాలెంట్ అనే విషయం ఇప్పటికే ఆయన గత సినిమాలు ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు చూస్తేనే అర్ధం అవుతోంది. అందుకే మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :