బాక్సాఫీస్ దగ్గర ‘కూలీ’ మాస్ ర్యాంపేజ్.. గంటలో లక్ష టికెట్లు..!

బాక్సాఫీస్ దగ్గర ‘కూలీ’ మాస్ ర్యాంపేజ్.. గంటలో లక్ష టికెట్లు..!

Published on Aug 12, 2025 10:03 PM IST

coolie

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్‌కు ముందే ర్యాంప్ ఆడిస్తోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను భారీ హైప్ మధ్య ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపుతున్నారు.

ఇక తాజాగా ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ తెరుచుకోవడమే ఆలస్యం అన్నట్లు రజినీ తన ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. గడిచిన గంటలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 100K కి పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ మాస్ ర్యాంపేజ్ చూయిస్తున్నాడని.. ఇది ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు