షూటింగ్ ముగించుకున్న ‘కూలీ’

షూటింగ్ ముగించుకున్న ‘కూలీ’

Published on Mar 17, 2025 11:00 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే, ఈ సినిమా షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రజినీకాంత్‌ను మరింత స్టైలిష్‌గా దర్శకుడు లోకేశ్ చూపించబోతున్నాడని ఈ సినిమా పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబెకా మోనికా జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు