సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా ఇప్పుడు నటించిన సెన్సేషనల్ సీక్వెల్ సినిమా జైలర్ 2 తర్వాత తను హీరోగా నటిస్తున్న మరో క్రేజీ మాస్ ప్రాజెక్ట్ నే “ధర్మన్”. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా పూర్తవుతుంది. లేటెస్ట్ గానే సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసేసిన మేకర్స్ దీనిపై క్రేజీ ప్రోమో కూడా వదిలారు.
అయితే దర్శకుడు ఈ సినిమాని మాములు స్పీడ్ లో పూర్తి చేయడం లేదట. మామూలుగా నాలుగు రోజుల్లో ప్లాన్ చేసుకునే షెడ్యూల్ షూట్ ని రెండే రోజుల్లో పూర్తి చేసేస్తున్నాడట. పైగా ఔట్ పుట్ కూడా ఏమాత్రం తగ్గకుండా వస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ధర్మన్ ఇదే స్పీడ్ లో వెళితే చాలా త్వరగానే షూట్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రావడం గ్యారెంటీ. ఇక ఈ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


