రాజకీయాల పై క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ !

Published on Jul 12, 2021 4:00 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ తానూ భవిష్యత్తులో కూడా ఎలాంటి రాజకీయ ఆలోచనలు చెయ్యను అని, తన రాజకీయ పార్టీ పై మొత్తానికి ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఫ్యాన్స్ తో సమావేశం అయిన రజిని తాజాగా చెప్పిన ఈ మాటకు మళ్ళీ ఫ్యాన్స్ బాగా నిరాశకి గురయ్యారు. ఇక రజినీకాంత్ మీడియాతో కూడా మాట్లాడారు.

రజినీ మాటల్లోనే ‘నేను అమెరికా వెళ్లొచ్చింది సాధారణ వైద్య పరీక్షల కోసమే. ఇక నా అభిమానులకు నా రాజకీయ అరంగేట్రంపై అనేక సందేహాలున్నాయి. నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాను అని వారు కలలు కంటున్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావట్లేదు. రాజకీయాల కోసం నేను పెట్టిన మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో రజినీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేయబోతున్నాను’ అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :