
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏది చేసినా సంచలనమే.. ఇన్ని రోజులు తన సినిమాలతో, తన సింప్లిసిటీతో ప్రేక్షకులను మెప్పించిన రజినీకాంత్ ఇప్పుడు సోషల్ మీడియా ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీ కాంత్ నిన్న మధ్యాహ్నం తన ట్విట్టర్ అకౌంట్ ని మొదలు పెట్టాడు. అప్పటి నుండి ఆయన్ని తన అభిమాన సంద్రం ఫాలో అవ్వడం మొదలు పెట్టింది. ట్విట్టర్ మొదలు పెట్టిన మొదటి 8 గంటల్లోనే ఆయన్ని 1లక్షా 50 వేల మంది ఫాలో అయ్యారు.
ప్రస్తుతం రజినీ కాంత్ ఫాలోవర్స్ లిస్టు 1,95,000 కి చేరింది. దీంతో మొదటి రోజే ఆయన రెండున్నర లక్షల ఫాలోవర్స్ అవుతారని అంచనా వేస్తున్నారు. రజినీ కాంత్ నటించిన ‘విక్రమసింహా’ మే 9న విడుదల కావడానికి సిద్దమవుతోంది. మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో నిర్మించిన ఈ సినిమాకి సౌందర్య రజినీకాంత్ దర్శకురాలు. మే 9న ఈ సినిమా పలు భాషల్లో సుమారు 3000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

