కొత్త పార్టీ ప్రకటనకు డేట్ ఫిక్స్ చేసేసిన తలైవర్.!

కొత్త పార్టీ ప్రకటనకు డేట్ ఫిక్స్ చేసేసిన తలైవర్.!

Published on Dec 3, 2020 3:00 PM IST

తన బాక్సాఫీస్ స్టామినాతో తనదైన హీరోయిజం తో ప్రపంచాన్ని ఇండియన్ సినిమా వైపు ఎప్పుడో తిప్పిన తమిళ్ తలైవర్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తమిళ రజిని ఫాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అలాగే ఆ మధ్య సంకేతాలు ఇచ్చి అసలు పార్టీ పెడుతున్నారా లేదా అన్న విషయంపై మాత్రం సస్పెన్స్ ను ఉంచేశారు. దీనితో తమిళ నాట ఒకరకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి అయితే అందరి చూపులు రజిని వైపే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎట్టకేలకు మాత్రం ఆ బిగ్ డే ఎప్పుడో అనౌన్స్ చేసేసి ఒక్క తమిళనాట రాజకీయాల్లోనే కాకుండా దేశవాళీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా నిలిచారు. ఇంతకీ తన కొత్త పార్టీను ఎపుడు ప్రకటించనున్నారంటే ఈ ఏడాది ముగింపు డిసెంబర్ 31న తన కొత్త పార్టీకు అధికారికంగా ప్రకటించి..

కొత్త సంవత్సరం ఆరంభంతో పురుడు పోయనున్నారు. ఈ ప్రకటన కోసమే ఎంతో కాలం నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మాత్రం తలైవర్ ఆ భారీ ప్రకటనను ఫైనల్ చేసేసారు. ఇప్పటికే అక్కడ విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. మరి రజిని పార్టీ విధి విధానాలు వారి పార్టీ పేరేంటో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు