ఛాటెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటున్న సూపర్ స్టార్

Published on Jun 14, 2021 10:13 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ట్రిప్ కోసం ఆయన ‘అన్నాత్తే’ షూటింగ్ కూడ చాలా త్వరగా ముగించేశారు. కానీ ప్రయాణానికి సిద్ధమయ్యే సమయానికి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం, ఇతర దేశాలు భారతీయుల రాక మీద ఆంక్షలు పెట్టడం జరిగిపోయాయి. దీంతో రజినీ ప్రయాణం వాయిదాపడింది. ఇప్పటికే చాలారోజులు ఎదురుచూసిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ యూఎస్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారట.

అందుకే ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. అంతేకాదు తన ప్రయాణానికి ప్రత్యేకమైన ఛాటెడ్ ఫ్లైట్ కూడ బుక్ చేసుకుంటున్నారట. రజినీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుని ఉండటంతో అనుమతులు సులభంగానే లభిస్తాయని తెలుస్తోంది. యూఎస్ ట్రిప్ ముగించుకుని ఇండియా వచ్చాక కొత్త ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టి, ‘అన్నాత్తే’ డబ్బింగ్ పనులు ఫినిష్ చేస్తారట సూపర్ స్టార్. ఈలోపు డైరెక్టర్ శివ ఇతర నటీనటులు మీద మిగిలి ఉన్న కొద్దిపాటి చిత్రీకరణను కంప్లీట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :